బిగ్ బాస్ తెలుగు 10 వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లపై తీవ్రంగా మండిపడ్డారు. నియమాల ఉల్లంఘన, అసభ్య ప్రవర్తనపై రోహిత్‌ను లివింగ్ రూమ్ నుంచి పంపించి, బిగ్ బాస్‌ను అగౌరవపరిచినందుకు ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. క్షమాపణ చెప్పడంతో ఎల్లో కార్డుతో హెచ్చరించి లోపలికి పిలిచారు. అమన్‌కు ఎల్లో కార్డ్ ఇవ్వగా, అపూర్వ, ముకేశ్, శాలిని ప్రవర్తనపైనా నాగ్ విమర్శలు చేశారు.
బిగ్ బాస్ 10: కంటెస్టెంట్లపై నాగార్జున ఆగ్రహం, రోహిత్‌కు హెచ్చరిక
Source: Asianet Telugu