ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వయోభారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 60కి పైగా చిత్రాలను తెరకెక్కించిన ఆయన, మూకీ చిత్రం ‘పుష్పక విమానం’, తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
Source: Asianet Telugu