అనంతపురం జిల్లా అప్పాజీపేటలో వారం రోజులుగా రాత్రివేళ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. పోలీసులు గస్తీ నిర్వహించినా, 20 మంది యువకులు సమీప కొండ ప్రాంతాన్ని పరిశీలించినా రాళ్లు పడటం కొనసాగుతోంది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. అదృశ్య శక్తులా లేక ఆకతాయిల పనా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
అనంతపురం జిల్లాలో రాత్రిపూట ఇళ్లపై రాళ్లు: పోలీసుల దర్యాప్తు
Source: Vaartha