రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని యాంటీ-ప్లేగు సంస్థలో ప్రయోగశాల సిబ్బంది డారియా షిపిలోవా ప్లేగు బాక్టీరియాకు గురై మరణించారు. ఈ ఘటనతో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించి, సుమారు 200 మందిని పర్యవేక్షణలో ఉంచారు. ప్రజా సమావేశాలు రద్దు చేయగా, ప్రయోగశాల నిర్వహణపై క్రిమినల్ కేసు నమోదైంది. నిపుణులు ప్లేగు గాలి ద్వారా వ్యాపించదని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
సైబీరియాలో ప్లేగు మరణం.. 200 మంది పర్యవేక్షణలో
Source: Gulte Telugu