బెంగళూరు–ముంబై మధ్య కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఏపీలోని అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో ఆగనుంది. 16 కోచ్లతో కూడిన ఈ రైలులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ కోచ్లు ఉంటాయి. థర్డ్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.3,000 ఉండొచ్చని, టికెట్ ధరలోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే అవకాశం ఉందని సమాచారం. తుది ఛార్జీలను రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
బెంగళూరు–ముంబై వందే భారత్ స్లీపర్ రైలు ఏపీ మీదుగా
Source: telugutimes.net