ఉదయాన్నే కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా ఒక గ్లాసు రాగి జావ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. రాగిలో పీచు పదార్థం, క్యాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల బరువు నియంత్రణ, ఎముకల బలం, రక్తహీనత నివారణకు ఇది ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మధుమేహం ఉన్నవారికి చక్కెర లేకుండా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధంగా ఉంటాయి.
ఉదయం కాఫీ, టీలకు బదులు రాగి జావ తాగండి
Source: Vaartha