ఆదాయపు పన్ను శాఖ దాడులపై నటి రకుల్ ప్రీత్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. తాను ఎక్కడా బెనామీ ఆస్తులు కలిగి లేనని, ఎవరూ తనకు ఆస్తులు బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరురాలినని, 20 ఏళ్ల నుంచే పన్నులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఐటీ దాడులకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఐటీ దాడులపై రకుల్ ప్రీత్ స్పందన
Source: Gulte Telugu