రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ టూ-స్టార్‌కు అప్‌గ్రేడ్ చేయాలని, 2029 నాటికి అన్ని పాఠశాలలను 4-స్టార్‌కు, కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్‌కు చేర్చాలని లక్ష్యం నిర్దేశించారు.
ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ: మంత్రి లోకేష్
Source: telugutimes.net