భారత పర్యటనకు వచ్చిన స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్కు ప్రధాని నరేంద్ర మోదీ మూడు ప్రత్యేక భారతీయ చీజ్లను బహుమతిగా అందించారు. అక్టోబర్ 5న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. గుల్మార్గ్, కోణార్క్, యీవూర్ అనే ఈ చీజ్లు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలుచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్విస్ చీజ్లకు గుర్తింపు ఉన్నా, భారత్లోనూ నాణ్యమైన చీజ్లు తయారవుతున్నాయని ఈ కానుక చాటింది.
స్విస్ అధ్యక్షుడికి మోదీ ప్రత్యేక భారతీయ చీజ్ బహుమతి
Source: Asianet Telugu