అమెరికాలోని శాన్ డియాగోలో యూసీ శాన్ డియాగో వేదికగా అక్టోబర్ 30, 2026న టాల్‌హెల్త్ ఫెస్ట్ 2026 నిర్వహించనున్నారు. టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించే ఈ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులను విశిష్ట అతిథులుగా ఆహ్వానించారు. హెల్త్‌కేర్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ ప్రగతిని ప్రపంచ వేదికపై చర్చించనున్నారు.
శాన్ డియాగోలో టాల్‌హెల్త్ ఫెస్ట్ 2026.. తెలంగాణ మంత్రులకు ఆహ్వానం
Source: telugutimes.net