ఢిల్లీలో భారత్, స్విట్జర్లాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని నరేంద్ర మోదీ, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ మధ్య అత్యున్నత స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వాణిజ్యం, సాంకేతికత, కృత్రిమ మేధ, పరిశోధన, వలసల నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక హరిత ఆర్థిక వ్యవస్థ రంగాల్లో సహకారం విస్తరించనుంది.
భారత్-స్విట్జర్లాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
Source: Vaartha