కాంగో నదిలో ఆదివారం సాయంత్రం రెండు మోటారు చెక్క పడవలు ఢీకొనడంతో కనీసం 30 మంది మృతి చెందారు. ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్‌గోంబే-లుకోలెలా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో డజన్ల మంది గల్లంతయ్యారు. మృతులను ఖననం చేసినట్లు ప్రావిన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్పిన్ ఎంపుటు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
కాంగో నదిలో పడవల ఢీకొనడంతో 30 మంది మృతి
Source: Telugu Post