అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఐటీడీపీ విభాగంపై నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. పార్టీ, ప్రభుత్వాల మధ్య ఐటీడీపీ వారధిగా నిలవాలని, వ్యక్తులు కాదు వ్యవస్థే ప్రధానమని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలును ప్రజలకు వివరించాలని, ప్రత్యర్థుల అసత్య ప్రచారాన్ని ఆధారాలతో ఖండించాలని సూచించారు. ప్రతి సభ్యుడిని మై టీడీపీ యాప్‌తో అనుసంధానించాలని లోకేశ్ స్పష్టం చేశారు.
వ్యక్తులు కాదు, వ్యవస్థే ముఖ్యం: నారా లోకేశ్
Source: Vaartha