తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ పరస్పర ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కోరింది. భూకబ్జాలు, అవినీతిపై ఇరువర్గాలు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, వాస్తవాలు వెల్లడించి ప్రజాస్వామ్యంపై నమ్మకం నిలబెట్టాలని ఎఫ్జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
రేవంత్, కేటీఆర్ ఆరోపణలపై స్వతంత్ర విచారణకు ఎఫ్జీజీ డిమాండ్
Source: telugutimes.net