అండర్-19 ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 8న ఒమన్‌లోని ఓసీఏ గ్రౌండ్ 1 వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విభజించబడగా, ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. లీగ్ దశలో 12 మ్యాచ్‌లు జరగనుండగా, సెమీఫైనల్స్ నవంబర్ 12న, ఫైనల్ నవంబర్ 14న జరుగుతాయి.
అండర్-19 ఆసియా కప్ షెడ్యూల్ విడుదల, నవంబర్ 8న భారత్-పాక్ పోరు
Source: Vaartha