గుంటూరు జిల్లా కొల్లిపర మండలం హనుమాన్ పాలెం సమీపంలో ఇసుక ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. దావులూరు పాలెం గ్రామానికి చెందిన అద్దంకి రాజారావు, ఏమినేని రాగమ్మ వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గుంటూరు జిల్లాలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు రైతులు మృతి
Source: Vaartha