అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలో తెలుగు విద్యార్థిని బలవంతంగా పని చేయించి వేధించిన కేసులో ముగ్గురు తెలుగు వాసులకు కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు వెంకటేష్ సత్తారుకు 50 నెలలు, నిఖిల్ పెన్మత్సకు 37 నెలలు, శ్రావణ్ పెనుమెచ్చకు 30 నెలలు విధించారు. 2022లో ఏపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఏడు నెలల పాటు మూడు ప్రదేశాల బేస్‌మెంట్లలో బంధించి, ఆహారం, మరుగుదొడ్డి వాడకం నిరాకరించి, శారీరకంగా హింసించినట్లు తేలింది.
అమెరికాలో తెలుగు విద్యార్థిపై వేధింపులు: ముగ్గురికి జైలు శిక్ష
Source: Gulte Telugu