తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండటంతో శ్రీవారి దర్శనం సులభంగా జరుగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. దసరా సెలవులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నందున రేపటి నుంచి రద్దీ పెరగనున్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న శ్రీవారిని 66,404 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుదల.. సులభంగా స్వామి దర్శనం
Source: Telugu Post