అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ఆరోపణలను మైక్రోసాఫ్ట్ తోసిపుచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన దాదాపు 6,000 హెచ్-1బీ దరఖాస్తుల్లో 80 శాతం ఇప్పటికే ఉద్యోగుల స్థితి పొడిగింపు లేదా మార్పు కోసమేనని, కొత్త నియామకాలు కావని కంపెనీ స్పష్టం చేసింది. అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారే మిగిలిన దరఖాస్తులు దాఖలు చేశారని తెలిపింది. ఈ కేసు భారత ఐటీ నిపుణుల భవిష్యత్తుపై ఆందోళన కలిగించింది.
హెచ్-1బీ ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ స్పందన
Source: Gulte Telugu