అమెరికాలోని శాన్ ఆంటోనియో తెలుగు సంఘం (టాసా) ఆధ్వర్యంలో ఈ ఏడాది దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి 50 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయనను సత్కరించనున్నారు. నవంబర్ 1, 2026న ష్రైన్ ఆడిటోరియంలో కోటి, ఆయన బృందం లైవ్ కన్సర్ట్ నిర్వహిస్తారు. టికెట్లకు అక్టోబర్ 26 వరకు ఎర్లీ బర్డ్ రాయితీ అందుబాటులో ఉంది.
శాన్ ఆంటోనియోలో కోటి 50 ఏళ్ల సంగీత ప్రస్థానానికి స్వర నీరాజనం
Source: telugutimes.net