సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామంలో సంగమేశ్వర బతుకమ్మ చెరువు వద్ద దుస్తులు ఉతుకుతున్న సమయంలో సంగారెడ్డి నీటిలో పడిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో హర్షవర్ధన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, కృష్ణవేణి కూడా నీటిలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో నర్సింహా రెడ్డి, కృష్ణవేణి, సంగారెడ్డి మృతి చెందగా, హర్షవర్ధన్ రెడ్డి చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.
చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Source: Vaartha