ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఎస్‌టీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రణేంద్ర కుమార్ సింగ్‌పై వింత లంచం ఆరోపణలు వచ్చాయి. మద్యం అక్రమ రవాణా కేసు నుంచి పేరు తొలగించేందుకు రెండు ఆవులు, ఒక గేదె, జర్మన్ షెపర్డ్ కుక్క, రూ.35 వేలు డిమాండ్ చేసినట్లు హరియాణా హిసార్‌కు చెందిన మన్‌వీర్ సింగ్ ఫిర్యాదు చేశారు. 45 ఆడియో రికార్డింగ్‌లు ఆధారాలుగా ఇచ్చినట్లు తెలిసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
లంచంగా రెండు ఆవులు, గేదె, కుక్క, రూ.35 వేలు కోరిన పోలీస్ అధికారి
Source: telugutimes.net