ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 35,333 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. సుమారు 2.81 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఏపీలో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Source: Vaartha