నవంబర్ 2026 వీసా బులెటిన్‌లో భారతీయులకు కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల్లో ఊరట లభించింది. F1, F2B, F3 కేటగిరీల ఫైనల్ యాక్షన్, ఫైలింగ్ తేదీలు ఏడాది ముందుకు కదిలాయి. కానీ EB-1, EB-2 తేదీల్లో మార్పు లేదు; EB-3లో 21 రోజుల పురోగతి మాత్రమే. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు ఆశించే భారతీయ నిపుణులకు ఇది నిరాశ.
నవంబర్ వీసా బులెటిన్: కుటుంబ గ్రీన్ కార్డుల్లో పురోగతి, ఉద్యోగ కేటగిరీల్లో నిలకడ
Source: telugutimes.net