నాని, సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న బ్లడీ రోమియో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మారినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ లక్కరాజు స్థానంలో దురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్దేవ్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం లండన్‌లో తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ మార్పుపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బ్లడీ రోమియోకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్?
Source: telugutimes.net