తిరుపతి జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, మంగళం సప్తగిరి కాలనీ పోలింగ్ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ఎదురుపడ్డారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టవద్దని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సుధారెడ్డి కోరారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తిరుపతిలో చెవిరెడ్డి, సుధారెడ్డి మధ్య మాటల యుద్ధం
Source: Vaartha