ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు 9,19,367 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారని, మరుసటి రోజు ఆ సంఖ్య 10,35,154కు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. విశాఖపట్నంలో బ్యాలెట్ బాక్సులు ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేయలేదని ఆరోపించారు. ఈ అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ పోలింగ్‌పై జగన్ ఆరోపణలు, ఎస్ఈసీ వివరణకు డిమాండ్
Source: Vaartha