ఉత్తరాదిన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ హీరోల చిత్రాలకు భారీ క్రేజ్ ఉన్నా, సంగీత దర్శకుల విషయంలో మాత్రం తమిళ దర్శకులదే పైచేయి. ఏ.ఆర్. రహమాన్, ఇళయరాజా, అనిరుధ్ రవిచందర్‌లకు నార్త్‌లో ఉన్న ఆదరణ కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్, తమన్లకు లేదని పలువురు చెబుతున్నారు. ‘జవాన్’ విజయంతో అనిరుధ్ జాతీయ స్థాయిలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడయ్యారు.
ఉత్తరాదిన టాలీవుడ్ హీరోల క్రేజ్.. తమిళ సంగీత దర్శకుల హవా
Source: Chitrajyothy