బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజులు వాతావరణం మారనుంది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Source: Asianet Telugu