బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. బలమైన గాలులు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
Source: Vaartha