ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అధ్యయనం చేయాలని ఆదేశించారు. 2029 నాటికి యూనిట్ రూ.4కే విద్యుత్ కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి హెచ్చుతగ్గులను సమతుల్యం చేసేందుకు నిల్వ వ్యవస్థలు కీలకమని పేర్కొన్నారు.
ఏపీలో విద్యుత్ రంగ భవిష్యత్తుపై సీఎం కీలక సమీక్ష
Source: HMTV