బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా. హైదరాబాద్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Source: Vaartha