ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక ప్రకారం, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బంది కొరత 1.11 కోట్లకు (11.1 మిలియన్లు) చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం ప్రపంచ డాక్టర్లలో దాదాపు 25% మంది 55 ఏళ్లు పైబడినవారే కావడంతో రాబోయే దశాబ్దంలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగనున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ముప్పు మరింత తీవ్రంగా ఉంది. ధనిక, పేద దేశాల మధ్య వైద్య వనరుల లభ్యతలో భారీ అంతరాలు ఉన్నట్లు WHO గుర్తించింది.
ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల కొరత 2030 నాటికి 1.11 కోట్లకు చేరనున్నట్లు WHO హెచ్చరిక
Source: Vaartha