ఇటలీలో ఈ ఏడాది ఇప్పటివరకు 650కు పైగా వెస్ట్ నైల్ వైరస్ కేసులు నమోదయ్యాయి. యూరప్‌లోని మొత్తం కేసుల్లో దాదాపు సగం ఇటలీలోనే ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దోమల వృద్ధికి అనుకూలంగా మారడంతో వైరస్ వ్యాప్తి కాలం నవంబర్ వరకు కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోనూ 24కు పైగా కేసులు నమోదయ్యాయి.
ఇటలీలో వెస్ట్ నైల్ వైరస్ విస్తరణ; 650కు పైగా కేసులు
Source: Telugu Post