బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండటంతో ఏపీ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Source: Vaartha