వంటగదిలో ఎల్పిజి సిలిండర్ నుంచి స్టవ్‌కు గ్యాస్ తీసుకెళ్లే హోస్ అత్యంత ముఖ్యమైన భద్రతా భాగం. సురక్షా ఎల్పిజి హోస్‌కు సాధారణంగా ఐదేళ్ల జీవితకాలం ఉంటుందని ఇండియన్ ఆయిల్ తెలిపింది. పగుళ్లు, కోతలు, బిరుసుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మార్చాలి. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారైన హోస్‌ను మాత్రమే వాడాలి. గ్యాస్ వాసన వస్తే రెగ్యులేటర్ ఆపి, గాలి ప్రసరణ కల్పించి, 1906 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి.
ఎల్పిజి గ్యాస్ పైపు భద్రత: ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా మార్చాలి
Source: telugutimes.net