కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి, వాస్కోడగామ–వేళంగిణి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రస్తుతం కుప్పంలో 59 రైళ్లకు హాల్ట్‌లు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ విస్తరణతో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం కోసం ప్రయాణించే ప్రజలకు సౌకర్యం కలగనుంది.
కుప్పం స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్‌లు ప్రారంభం
Source: telugutimes.net