హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు బుధవారం రాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఉత్సవ కమిటీ, పోలీసులు స్పష్టం చేశారు. నిమజ్జన ఏర్పాట్ల నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి మండపం వద్ద షెడ్లు, బ్యారికేడ్లు తొలగిస్తారు. ఈ ఏడాది 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి ప్రతిష్టించగా, శుక్రవారం శోభాయాత్రతో నిమజ్జనం పూర్తవుతుంది.
ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనాలు బుధవారం రాత్రితో ముగింపు
Source: Vaartha