ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'వేదవ్యాస్' చిత్ర బృందం వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మాతగా, అచ్చిరెడ్డి సమర్పకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వేదాలు, భారతీయ సంస్కృతి ప్రాధాన్యతను చాటే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని చిత్ర బృందం తెలిపింది.
వేదవ్యాస్ చిత్ర బృందం ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం
Source: Chitrajyothy