తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 నుండి 48 గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ సహా 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆదిలాబాద్, నిర్మల్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్
Source: Vaartha