ఒమాహాలోని Siena Francisలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) సెప్టెంబర్ 19న 'Feed the Need – Youth Charity & Food Drive' నిర్వహించింది. యువత, కుటుంబ సభ్యులు అవసరంలో ఉన్నవారికి భోజనం అందించారు. అనంతరం ఆశ్రయం విభాగాలు, నివాస ప్రాంతాలను సందర్శించి నిరాశ్రయుల జీవన పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. ప్రతి త్రైమాసికంలో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్వాహకులు సంకల్పించారు.
నెబ్రాస్కా తెలుగు సమితి 'Feed the Need' కార్యక్రమం విజయవంతం
Source: telugutimes.net