బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తీవ్ర వాయుగుండం తీరం దాటి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
Source: Telugu Post