ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారిక ప్రకటన రాలేదు. వార్త నిజమైతే 51 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ఆయన తెలుగు సినిమాలో నటించినట్లవుతుంది. చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
కల్కి 2లో నసీరుద్దీన్ షా?
Source: Chitrajyothy