తీవ్ర అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలతో విశాఖపట్నం జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. తాటిపూడిలో 278 అడుగులు, మేఘాద్రిగెడ్డలో 49 అడుగులు, ముదసర్లోవలో 160 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎండిపోయిన ముదసర్లోవకు కంబళకొండ నుంచి నీరు చేరి మూడు అడుగులు పెరిగింది. దీంతో తాగునీటి కొరత తగ్గి భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు.
వైజాగ్ జలాశయాలకు భారీ వరద నీరు
Source: Webdunia Telugu