ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి పేరు, ప్రజాదరణ ఉన్న అభ్యర్థులను నిలబెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో తొందరపాటు వద్దని, స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఎన్నికల విజయం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పునాది అవుతుందని ఆయన అన్నారు.
స్థానిక ఎన్నికల్లో మంచి పేరున్న అభ్యర్థులే: జగన్
Source: Vaartha