తీవ్ర వాయుగుండం బలహీనపడుతున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో గత 48 గంటల వర్షాలకు ఎనిమిది మంది మృతి చెందగా, విశాఖపట్నంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
Source: Asianet Telugu