తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి. కోస్తాంధ్ర, యానాంలో సముద్ర తీరం వెంట గాలి వేగం 50 కిలోమీటర్లకు చేరవచ్చు. గోదావరికి వరద పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహం 8-9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని APSDMA అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల వర్షాల హెచ్చరిక
Source: Asianet Telugu