హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం పూల వ్యర్థాలతో రసాయనాలు లేని అగర్‌బత్తీలు తయారవుతున్నాయి. హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, ఉప్పల్, బాచుపల్లి కేంద్రాల్లో 24 టన్నుల పూలు సేకరించారు. వాటిని శుభ్రం చేసి ఎండబెట్టి పొడిగా మార్చి, ఎలాంటి కెమికల్స్ కలపకుండా స్వచ్ఛమైన ధూపం, రంగులు తయారు చేస్తున్నారు. ఈ చొరవ పర్యావరణాన్ని కాపాడుతూ భక్తులకు స్వచ్ఛమైన పూజా సామగ్రిని అందిస్తోంది.
గణేశ్ పూల వ్యర్థాలతో కెమికల్ రహిత అగర్‌బత్తీలు
Source: Vaartha