క్యాన్సర్ చికిత్సలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఫిజిసిస్ట్స్ ఆఫ్ ఇండియా (AMPI) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ వార్షిక సదస్సు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ రేడియేషన్ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ టీ. ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో రేడియేషన్ డోసు కచ్చితత్వం, రోగి భద్రత, డయాగ్నస్టిక్ ఇమేజింగ్, రేడియేషన్ ఆంకాలజీలో జనరేటివ్ ఏఐ వినియోగంపై నిపుణులు చర్చించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, డిజిటల్ ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలని సూచించారు.
క్యాన్సర్ చికిత్సలో ఏఐ వినియోగంపై వైద్య నిపుణుల సదస్సు
Source: Asianet Telugu