టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ మూగజీవాల సంరక్షణ, అధికారుల బాధ్యతలపై సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు. జంతు సంరక్షణ కేంద్రాల దుస్థితి, ప్రభుత్వ పశువైద్యశాలల సదుపాయాల కొరత, వీధి కుక్కలు, పిల్లులకు వ్యాక్సిన్లు, బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జరగకపోవడంపై ఆమె నిలదీశారు. తనను విమర్శించినా పట్టించుకోనని, అధికారులను ప్రశ్నించాలని ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
మూగజీవాలపై రష్మీ గౌతమ్ ప్రశ్నలు, ట్రోలర్లకు కౌంటర్
Source: Asianet Telugu